మంథని ఆటో యూనియన్ నూతన అధ్యక్షుడిగా గడిపెల్లి శ్రీనివాస్ ఎన్నిక
రిపోర్టర్: Subhan.Manthani
స్థలం: మంథని
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని గోదావరి తీరంలో మైత్రి ఆటో యూనియన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఉత్సాహంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆటో యూనియన్ అధ్యక్షుడిగా గడిపెల్లి శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. మొత్తం రెండు వందల ముప్పై ఏడు ఓట్లు పోలవగా, శ్రీనివాస్‌కు నూట నలభై ఆరు ఓట్లు వచ్చాయి. సమీప అభ్యర్థిపై యాభై ఒక్క ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల కమిటీ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.