వీబీ జీరామ్ జీ పథకం అమలుపై మంత్రి సీతక్క సమీక్ష
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
వీబీ జీరామ్ జీ పథకం అమలుపై మంత్రి సీతక్క సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మండల, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పన్నెండేసి వేలకు పైగా సర్పంచులు పాల్గొన్న ఈ సమావేశంలో ఉపాధి పనుల గుర్తింపు, పురోగతి, క్షేత్రస్థాయి సమస్యలపై సమీక్షించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించాలని, గ్రామసభల నిర్ణయాలకు ప్రాధాన్యమిస్తూ పారదర్శకతతో పనులు చేపట్టాలని ఆమె ఈ సందర్భంగా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు.