ఆంధ్రప్రదేశ్ లో వృద్ధులకు అదనపు పెన్షన్ పెంపు
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధులకు తీపి కబురు అందిస్తూ వయోవృద్ధులకు అందజేసే అదనపు పెన్షన్ శాతాన్ని పెంచుతూ ఆర్థిక శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 70 ఏళ్ల వృద్ధులకు ఇస్తున్న 7 శాతం అదనపు పెన్షన్ను 10 శాతానికి, 75 ఏళ్ల వృద్ధులకు ఇస్తున్న 12 శాతం పెన్షన్ను 15 శాతానికి పెంచారు. డిసెంబర్ 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధన ద్వారా 2027 జనవరి 1 నుంచి పెరిగిన సొమ్మును చెల్లించనున్నారు.