చిత్రకోట బొడ్డవలస పాఠశాల కమిటీ చైర్మన్గా లక్ష్మి ఎన్నిక
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం చిత్రకోట బొడ్డవలస గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల కమిటీ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో గొట్టాపు లక్ష్మి పాఠశాల కమిటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ పాఠశాల సమగ్ర అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించేందుకు తన వంతు పూర్తి కృషి చేస్తానని స్పష్టం చేశారు.