ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక భేటీ
రిపోర్టర్: మహేష్
స్థలం: న్యూఢిల్లీ
దిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. దౌత్య, రక్షణ సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. సుఖోయ్-57 యుద్ధ విమానాల విక్రయం, అణు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, సొంత కరెన్సీలలో వాణిజ్యం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నట్లు రష్యా అధికార ప్రతినిధి తెలిపారు.