జన్నారంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

జన్నారం మండలంలో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను స్థానిక లబ్ధిదారులకు అందజేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పేద ప్రజల వైద్య చికిత్సలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఆసరాగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు అజ్మీరా నందు నాయక్, ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీ నారాయణ, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.