రాత్రి పూట కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయని ఎమ్మెల్యే ఆందోళన

రిపోర్టర్: సతీష్ స్థలం: Telangana

రాష్ట్రంలో రాత్రి పూట సరైన విద్యుత్ అందక రైతుల పంటలు ఎండిపోతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరెంట్ కోతల వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. వెంటనే విద్యుత్ సరఫరాను మెరుగుపరిచి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.