నగర వీధుల్లో వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగర వీధుల్లో ఖైరతాబాద్ మహా గణనాథుని శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగుతోందని నిర్వాహకులు తెలిపారు. భక్తుల జయజయధ్వానాలు, డప్పు చప్పుళ్లు, నృత్యాల మధ్య మహాగణపతి నిమజ్జన యాత్ర కనులపండువగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి నగర ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారని వెల్లడించారు. గణనాథుని శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.