హైదరాబాద్ లో సదర్ సంబరాలకు కదంతొక్కనున్న యాదవ దళం

రిపోర్టర్: saikiran స్థలం: శేరిలింగంపల్లి

నగరంలోని లోయర్ ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ స్టేడియంలో నవంబర్ నాల్గవ తేదీన శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఘనంగా జరగనుంది. ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల ముప్ఫై నిమిషాల వరకు సాగే ఈ ఉత్సవానికి యాదవ సోదర సోదరీమణులు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ యాదవ కురుమ కార్పొరేషన్ చైర్మన్ ఎం రఘునాథ్ యాదవ్ పిలుపునిచ్చారు.