డిగ్రీలు ఉన్నా ఉద్యోగాలు లేవు: నీతి ఆయోగ్ సంచలన నివేదిక

రిపోర్టర్: శివ స్థలం: India

భారతదేశంలో ఏటా లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నా, కేవలం 8.5% మందికి మాత్రమే నైపుణ్యానికి తగ్గ ఉద్యోగాలు దక్కుతున్నాయి. కాలం చెల్లిన విద్యా విధానం, మార్కెట్ అవసరాలకు, కళాశాలల బోధనకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసమే నిరుద్యోగానికి ప్రధాన కారణమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. డిగ్రీలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని, యువతకు ఉపాధి కల్పించడంలో ప్రస్తుత విద్యా వ్యవస్థ విఫలమవుతోందని నివేదిక హెచ్చరించింది.