పెళ్లిపీటల కంటే ముందే ఓటేసి ఆదర్శంగా నిలిచిన నవవధువు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: గరుగుబిల్లి

ప్రజాస్వామ్య పండగలో ఓటు హక్కుకు ప్రాధాన్యతనిస్తూ నవ వధువు వాణి అందరికీ ఆదర్శంగా నిలిచారు. గరుగుబిల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడి గ్రామంలో జరగనున్న వివాహ వేడుకకు బయలుదేరారు. పెళ్లి వేడుక కంటే ముందుగా ఓటు వేయడానికే ప్రాధాన్యత ఇచ్చిన వాణి నిర్ణయంపై పలువురు అభినందనలు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.