నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న రవితేజ ఇరుముడి సినిమాపై సోషల్ మీడియాలో ట్రోల్స్
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి సినిమా థియేటర్లలో మంచి విజయం సాధించినప్పటికీ, ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత సోషల్ మీడియాలో భిన్నమైన చర్చకు దారితీసింది. తండ్రీకూతురు భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో కొన్ని లాజిక్స్ మరియు చైల్డ్ అబ్యూస్ అంశాలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తూ ట్రోల్స్ చేస్తుండటం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.