మహారాష్ట్రలో డ్రగ్స్ ల్యాబ్ గుట్టురట్టు: అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన ఈగల్ ఫోర్స్

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

తెలంగాణలో డ్రగ్స్ తయారీ, సరఫరా వెనుక దాగిన అంతర్రాష్ట్ర నెట్వర్క్ను ఈగల్ ఫోర్స్ పోలీసులు ఛేదించినట్లు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలోని గోండియా జిల్లా మారేగవ్లో రహస్యంగా నిర్వహిస్తున్న మత్తు పదార్థాల ల్యాబ్ను గుర్తించి దాడులు చేసినట్లు తెలిపారు. ఈ దందాలో ఇప్పటివరకు పదకొండు మంది నిందితులను అరెస్ట్ చేశామని, మరో పదమూడు మంది పరారీలో ఉన్నారని పేర్కొంటూ, ఈ ముఠా గుట్టు రట్టు కావడంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.