గూడెం కొత్తవీధిలో ప్రజా సమస్యలే అజెండాగా దూసుకెళ్తున్న సీపీఎం అభ్యర్థులు

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: జి.కె.వీధి

అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధిలో సీపీఎం అభ్యర్థులు జడ్పీటీసీ అభ్యర్థి అంపురంగి బుజ్జిబాబు, ఎంపీటీసీ అభ్యర్థి కొర్ర నీలకంఠం ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజలను నేరుగా కలుసుకుంటూ ఓట్లు అభ్యర్థించారు. రానున్న ఎన్నికల్లో తమను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నాయకులు స్పష్టం చేశారు.