సురుటపల్లిలో ఘనంగా వరుణయాగం: రైతుల సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి
నాగలాపురం మండలం సురుటపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వరుణయాగం కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కూరపాటి శంకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.