శ్రీకాకుళంలో ఘనంగా మాజీ మున్సిపల్ చైర్మన్ వరహానరసింహం జయంతి వేడుకలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Srikakulam

శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్మన్ అంధవరపు వరహానరసింహం 79వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వరం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉచిత కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. పట్టణాభివృద్ధిలో ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. సామాజిక సేవా కార్యక్రమాలతో ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.