అమరావతిని అన్స్టాపబుల్ నగరంగా మారుస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయవాడ
విజయవాడలో జరిగిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి భవిష్యత్తులో ప్రపంచంలోనే నెంబర్ వన్ రాజధానిగా ఎదుగుతుందని స్పష్టం చేశారు. నగరంలో భారీ భవంతులు, బుల్లెట్ రైళ్లు, రింగ్ రోడ్లు రానున్నాయని వెల్లడించారు. విశాఖ నుంచి చెన్నై వరకు నాలుగు లేన్ల రైల్వే ట్రాక్ నిర్మిస్తామని తెలిపారు. కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీకి ఇరువైపులా మరో రెండు కొత్త బ్యారేజీలను నిర్మించి విజయవాడను నీటితో కళకళలాడేలా చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.