పొదలకూరులో సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్ల మద్దతు కోరిన వైఎస్సార్సీపీ
రిపోర్టర్: AHMED
స్థలం: పొదలకూరు
నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని మస్తాన్‌రెడ్డి నగర్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గంగవరపు లక్ష్మి కళ్యాణి, వాకాటి సంధ్య, కోవూరు వెంకటేశ్వర్లు, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి గడపగడపకూ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి నాయకత్వంలో స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని వారు స్పష్టం చేశారు.