అహ్మదాబాద్లో టొరెంట్ గ్రూప్ కార్యవిధులు పరిశీలించిన నారా లోకేష్

రిపోర్టర్: శివ స్థలం: గుంటూరు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో గుంటూరుకు చెందిన మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన టొరెంట్ గ్రూప్ కార్యవిధులు పరిశీలించడంతో పాటు ఆ సంస్థ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అద్భుతమైన అవకాశాలను, ప్రభుత్వ విధానాలను వివరించారు. రాష్ట్రంలో తదుపరి దశ అభివృద్ధి కార్యకలాపాలను ప్రారంభించాలని, పెట్టుబడులు పెట్టాలని టొరెంట్ గ్రూప్ యాజమాన్యానికి నారా లోకేష్ బలమైన ప్రతిపాదన సమర్పించారు.