జన్నారంలో ఇసుక మాఫియాపై విరుచుకుపడ్డ అటవీశాఖ అధికారులు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మందపల్లి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్ ను అటవీశాఖ అధికారులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ట్రాక్టర్ను ఇంధన్ పల్లి అటవీశాఖ రేంజ్ కార్యాలయానికి తరలించి అక్కడ ఉంచినట్లు ఎఫ్ఆర్ఓ బాబా ఖాదర్ వలీ తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై నిఘా కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.