అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి: కమిషనర్ లాలం రామలక్ష్మి
రిపోర్టర్: B RAJESH
స్థలం: బొబ్బిలి
బొబ్బిలి పట్టణంలో జరుగుతున్న బైపాస్ రోడ్డు పనులను బుధవారం కమిషనర్ లాలం రామలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత పాటించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆమె ఆదేశించారు. పనులను వేగవంతం చేయాలని సూచిస్తూ, కల్వర్టుల నిర్మాణ తీరును స్వయంగా తనిఖీ చేశారు. అనంతరం స్థానిక ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.