విద్యార్థులు లక్ష్యంతో చదివి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి సీపీ గౌస్ అలాం

రిపోర్టర్: రమేష్ స్థలం: కరీంనగర్

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లి గ్రామ ఉన్నత పాఠశాలలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, తల్లిదండ్రులకు భవిష్యత్తు ప్రణాళికపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని, సోషల్ మీడియాకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.