అరటి బోదెలతో జీవనోపాధి: సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి వ్యాపారవేత్తగా మారిన ఆనంద కుమారి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయవాడ

సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి అరటి బోదెల వ్యర్థాలతో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న విజయవాడకు చెందిన ఆనంద కుమారి వేల విలువ చేసే చీరలు, హ్యాండ్బ్యాగులు తయారుచేస్తున్నారు. నేచర్లింక్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి స్వయంగా ఆదాయం ఆర్జిస్తూ సుమారు మూడు వందల యాభై మంది గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పిస్తున్నట్లు వ్యవస్థాపకురాలు ఆనంద కుమారి తెలిపారు. పర్యావరణహిత ఉత్పత్తుల దిశగా ఆమె చేస్తున్న ఈ కృషికి కుటుంబ సహకారంతో పాటు ప్రభుత్వ మద్దతు లభించింది.