ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

బంగాల్ ఉపఎన్నికల్లో టీఎంసీ పార్టీ పేరు, గుర్తుల వినియోగంపై ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. పార్టీలను చీల్చి, ఎన్నికల గుర్తును లాక్కోవడానికి బీజేపీ, ఈసీ కలిసి పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఓటు చోరీ, ప్రభుత్వ చోరీతో పాటు ఇప్పుడు పార్టీ చోరీ ప్రజాస్వామ్య పతనానికి చిహ్నమని, ఈ పోరాటం స్వేచ్ఛాయుత ఎన్నికలు కోరుకునే ప్రతి ఒక్కరిదన్నారు.