ముద్రా లోన్ పేరుతో సైబర్ మోసం.. అప్రమత్తంగా ఉండాలి

రిపోర్టర్: RAVI BABU స్థలం: వెదురుకుప్పం

ప్రధాన్ మంత్రి ముద్రా యోజన పేరును దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు సూచించారు.

అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడి నుంచి రూ.2,25,297/- నగదు కాజేసిన ఘటనపై కేసు నమోదైంది. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి డబ్బులు పంపవద్దని, సైబర్ మోసాలపై 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.