చౌటుప్పల్లో ఘనంగా ‘చాయ్ దునియా’ టీ షాప్ ప్రారంభం
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ పురపాలక పరిధిలో నూతన ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లే దారిలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘చాయ్ దునియా’ టీ షాప్ను గోగు రవి ప్రారంభించారు. వినియోగదారులకు నాణ్యమైన టీ, ఇతర పానీయాలను అందించేందుకు ఈ షాప్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చినుకని యువరాజు, వాంక్డోత్ శ్రీకాంత్, మలిగే ఉదయ్ తదితరులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానికంగా కొత్త వ్యాపారం ప్రారంభం కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.