నిర్మాణ రంగానికి డిజిటల్ ఊతం: డిజిటల్ లేబర్ చౌక్ యాప్ ఆవిష్కరణ

రిపోర్టర్: సతీష్ స్థలం: Andhra Pradesh / Telangana

నిర్మాణ రంగ కార్మికులకు సాంకేతికత ద్వారా ఉపాధి అవకాశాలను చేరువ చేసేందుకు డిజిటల్ లేబర్ చౌక్ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని Ministry of Labour & Employment, GoI వెల్లడించింది. ఈ ప్రత్యేక యాప్ ద్వారా కార్మికులకు పారదర్శకమైన జాబ్ మ్యాచింగ్, నేరుగా పని అవకాశాలు, లొకేషన్ ఆధారిత సేవలతో పాటు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా అందించడం జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. దీని ద్వారా యజమానులు, కార్మికుల మధ్య దూరం తగ్గుతుందని పేర్కొన్నారు.