తెదేపాలో చేరిన వైకాపా నేతలు: క్రమశిక్షణతో పనిచేయాలని మంత్రి సూచన
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయనగరం
విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో బొండపల్లి మండలానికి చెందిన పలువురు వైకాపా నాయకులు, 60 కుటుంబాలు తెదేపాలో చేరారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సూచనల మేరకు పార్టీ క్రమశిక్షణ పాటిస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు.