డీయూ ఎన్నికల్లో ఏబీవీపీ అభ్యర్థి మార్క్స్‌షీట్ వివాదం

రిపోర్టర్: అశోక్ స్థలం: New Delhi

ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల వేళ ఏబీవీపీ అధ్యక్ష అభ్యర్థి యశ్ దబాస్ చుట్టూ వివాదం అలుముకుంది. ఆయనకు సంబంధించిన మార్క్స్‌షీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడం రాజకీయంగా కలకలం రేపింది. దీన్ని రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారంగా ఏబీవీపీ తీవ్రంగా ఖండించింది.