పాలకొండ పోలింగ్ కేంద్రాల్లో తనిఖీలతో గర్జించిన ఎస్పీ మాధవరెడ్డి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదివారం పట్టణంలోని పెద్దకాపు హైస్కూల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.