గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టు సీరియస్
రిపోర్టర్: సురేష్
స్థలం: Amaravati / New Delhi
విజయవాడ లాకప్ డెత్ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరియు డీజీపీ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాపు యువకుడు గాదె సాయికృష్ణ మృతి కేసు విచారణను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను తామే చేపడతామని స్పష్టం చేయడంతో రాష్ట్రంలో సంచలనం రేగింది. సాయికృష్ణ తల్లి పోరాటంతో ఈ కేసు అత్యున్నత ధర్మాసనం విచారణకు చేరింది.