మేడ్చల్ జిల్లాలో కుటుంబ కలహాలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

రిపోర్టర్: భాస్కర్ స్థలం: మేడ్చల్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీకారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాల కారణంగా సంతోష అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్నారు. పోచారం డివిజన్ సంస్కృతి టౌన్‌షిప్ సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఆమె శనివారం రాత్రి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.