బెల్లంపల్లిలో ఓటరు జాబితా సవరణ శిబిరాల పరిశీలన

రిపోర్టర్: SHIVA స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఆరో వార్డులో గల 55, 56 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ శిబిరాలను అదనపు కలెక్టర్ చంద్రయ్య శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆయన పర్యవేక్షించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సల్ల కృష్ణవేణి, డీటీ, ఆర్ఐ, వార్డు అధికారి, బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.