మనుబోలులో ముగిసిన ప్రచారం జోరుగా తెరవెనుక మంతనాలు
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. రాబోయే ఐదవ తేదీన జరగనున్న ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కోసం రాజకీయ పార్టీలన్నీ తమ చివరి విడత ప్రచారాన్ని పూర్తి చేశాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి నాయకులు వివిధ రకాల తాయిలాలను ఎరగా వేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి.