కొవ్వూరు పురపాలక సంఘం ఎన్నికల్లో భర్త ఏకగ్రీవం: భార్య కోసం ప్రచారం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తూర్పు గోదావరి

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పురపాలక సంఘం ఛైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో తెదేపా అభ్యర్థిగా కంఠమణి విజయలక్ష్మి బరిలో నిలిచారు. అదే పార్టీ నుంచి ఆమె భర్త కంఠమణి రామకృష్ణ పద్దెనిమిదో వార్డు కౌన్సిలర్గా నామినేషన్ దాఖలు చేయగా మిగిలిన వారు ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవమయ్యారు. దీంతో తన సతీమణి విజయలక్ష్మి విజయమే లక్ష్యంగా రామకృష్ణ విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ స్థానిక ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేలా తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం.