విశాఖలో నిరాశ్రయుల ఆకలి తీరుస్తున్న కమ్యూనిటీ ఫ్రిజ్‌ల సేవలు
రిపోర్టర్: సునీల్
స్థలం: విశాఖపట్నం
మిషన్ జ్యోతిర్గమయలో భాగంగా వైజాగ్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ఫ్రిజ్‌ల ద్వారా నిరాశ్రయులకు ప్రతిరోజూ ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు VizagCityPolice వెల్లడించారు. ఆహారం వృథా కాకూడదు మరియు ఎవరూ ఆకలితో ఉండకూడదనే మానవతా దృక్పథంతో నగరంలో ఇటీవల ఐదు ఫ్రిజ్‌లను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సేవలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దాతలు ముందుకు వచ్చి ఆహారాన్ని అందించాలని, ఇందుకోసం కంట్రోల్ రూమ్ సిఐని సంప్రదించాలని విశాఖ పోలీసులు కోరారు.