గాదె సాయికృష్ణది లాకప్ డెత్ అంటూ సిట్ సంచలన నివేదిక
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
గాదె సాయికృష్ణ కేసు విచారణలో భాగంగా పోలీసులు విచక్షణారహితంగా దాడి చేయడం వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. లాకప్‌లో జరిగిన తీవ్ర గాయాల కారణంగానే సాయికృష్ణ మృతి చెందినట్లు స్పష్టం చేస్తూ దర్యాప్తు అధికారులు న్యాయస్థానానికి సమగ్ర నివేదిక సమర్పించారు. సీఐ నాగరాజుతో పాటు పలువురు కానిస్టేబుళ్లు మృతదేహాన్ని రహస్యంగా దహనం చేసి సాక్ష్యాలను ధ్వంసం చేశారని సిట్ రిపోర్టులో వెల్లడించారు.