బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్: ఓవర్సీస్ విద్యానిధి దరఖాస్తు గడువు పొడిగింపు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: హుస్నాబాద్

తెలంగాణ ప్రభుత్వం బీసీ, ఈబీసీ విద్యార్థుల విదేశీ విద్య కోసం అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం దరఖాస్తు గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించింది. ఫాల్ సెషన్లో మాస్టర్స్, డాక్టోరల్ కోర్సులు చదివే అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలామాయాదేవి సూచించారు. నిర్ణీత గడువు ముగిసేలోగా అధికారిక పోర్టల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు.