ఆళ్లగడ్డ అభివృద్ధిపై ముఖాముఖి: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రత్యేక కార్యక్రమం

రిపోర్టర్: కిరణ్ స్థలం: నంద్యాల

నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో మన ఆళ్లగడ్డ మన బాధ్యత ముఖాముఖి కార్యక్రమం నిర్వహించినట్లు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రెడ్డి వెల్లడించారు. సిరివెళ్ల మండలం పచ్చర్ల గ్రామంలోని ప్రకృతి రమణీయ వాతావరణంలో ఈ కార్యక్రమం ఘనంగా సాగిందని ఆమె తెలిపారు. నియోజకవర్గ ప్రగతితో పాటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఇన్ఫ్లుయెన్సర్లు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.