మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సీఎం రేవంత్
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్లో మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక సంక్షోభాన్ని నివారించడంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ అందించిన సేవలను సీఎం రేవంత్ కొనియాడారు. మహనీయుడికి తక్షణమే అత్యున్నత పురస్కారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.