ముఖ్యమంత్రిగా వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్న సిద్ధరామయ్య
రిపోర్టర్: గోపి
స్థలం: బెంగళూరు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెండితెరపై మరోసారి ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది. రాజేష్ గౌడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కన్నడ చిత్రంలో ఆయన టైటిల్ రోల్ పోషిస్తున్నారు. కేవలం 48 గంటల్లోనే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ఈ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. కళాశాల రోజుల్లో నాటకాల్లో నటించిన అనుభవం ఉన్న ఆయన నటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.