పల్నాడులో జాతీయ రహదారి విస్తరణ పనులకు మంత్రి గొట్టిపాటి శంకుస్థాపన
రిపోర్టర్: వెంకట్
స్థలం: బాపట్ల
బాపట్ల జిల్లా కేసానుపల్లిలో చిలకలూరిపేట నుంచి నకరికల్లు వరకు ఎన్ హెచ్ 167 ఏ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నట్లు విద్యుత్ శాఖ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేర సాగే ఈ రహదారి నిర్మాణ పనులను రెండేళ్లలో పూర్తి చేసేలా పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామన్నారు. మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం ద్వారా పల్నాడు ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి మరింత ఊతమిస్తామని పేర్కొన్నారు.