యూపీఐ చార్జీలపై ఎలాంటి అపోహలు వద్దు అని కేంద్రం స్పష్టీకరణ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: భారతదేశం

యూపీఐ చార్జీలపై వస్తున్న అపోహలను కేంద్ర ప్రభుత్వం మరోసారి ఖండించింది. డిజిటల్ లావాదేవీలు ఖరీదవుతాయన్న వాదనలు తప్పు అని తేల్చిచెప్పింది. చిన్న వ్యాపారులకు నెలకు లక్ష వరకు యూపీఐ రసీదులపై ఎమ్‌డీఆర్ ఉండదని, అలాగే రెండు వేల వరకు యూపీఐ పేమెంట్స్‌పై ఎలాంటి చార్జీలు, జీఎస్టీ భారం ఉండదని స్పష్టమైన అధికారిక ప్రకటన వెలువరించింది.