భారీ వర్షాలకు పాఠశాల గోడ కూలి విద్యార్థులకు ముప్పు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: జి.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండలం దేవరపల్లి పంచాయతీ చీడిగొంధి గ్రామంలో ఎంపీపీ పాఠశాల గోడ భారీ వర్షాలకు కూలిపోయింది. భవనం శిథిలావస్థకు చేరిందని గతంలో అధికారులకు విన్నవించినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో నూట ఆరు మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్న నేపథ్యంలో ప్రాణ నష్టం జరగకముందే ప్రభుత్వం స్పందించి తక్షణమే నూతన భవనం మంజూరు చేయాలని కోరుతున్నారు.