అంతర్జాతీయ ఉద్రిక్తతలు: రష్యాను ఎస్-400 క్షిపణి వ్యవస్థ కోరిన ఇరాన్ దేశం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: టెహ్రాన్
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా నుండి అధునాతన ఎస్-400 వాయు రక్షణ వ్యవస్థను కోరినట్లు ఇరాన్ దేశ భద్రతాధికారి మొహ్సేన్ రెజాయ్ మాస్కో పర్యటనలో స్పష్టం చేసినట్లు ది టెలిగ్రాఫ్ తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఇరాన్ అత్యున్నత నేత మోజ్తాబా ఖమేనీ ప్రత్యేక లేఖను అందజేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి తుది ఒప్పందం లేదా సరఫరా గడువు ఖరారు కాలేదని అధికారులు పేర్కొన్నారు.