కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ కరపత్రం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: హైదరాబాద్

తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తపేటలో త్వరలో ప్రతిష్టించనున్న 33 అడుగుల భారీ కాంస్య విగ్రహ కరపత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు. ఎల్బీనగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ పున్న గణేష్ నేత, మాజీ విప్ ఈరవత్రి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి ఈ కరపత్రం ఆవిష్కరణ జరిపించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ పద్మశాలి నాయకులు పాల్గొన్నారు.