యానాంలో భారీ ధరకు అమ్ముడైన రుచికరమైన పులస చేప
రిపోర్టర్: రాము
స్థలం: యానాం
యానాం సమీపంలోని గౌతమి గోదావరి నదిలో మత్స్యకారులకు చిక్కిన కిలో బరువు ఉన్న పులస చేప వేలంలో రూ. 20,000లకు అమ్ముడైంది. స్థానికులు, మత్స్యకారులు పోటీపడి ఈ చేపను దక్కించుకోగా, దీనిని హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ వ్యాపారికి పార్శిల్ ద్వారా పంపించారు. వర్షాకాలంలో గోదావరిలోకి ఎదురీది వచ్చే ఈ అరుదైన చేప కోసం ఆహార ప్రియులు ఎంత ధర పెట్టడానికైనా వెనుకాడకపోవడం గమనార్హం.