అనకాపల్లి చిత్రానికి అన్ని ప్రాంతాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
అనకాపల్లి సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన లభిస్తున్నదని నిర్మాతలు నక్కిన త్రినాథరావు, కాండ్రేగుల నాయుడు తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన ఈ చిత్ర థ్యాంక్స్‌మీట్‌లో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ సహిదేవ్, నటి ఇంద్రజ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. సినిమా విజయం పట్ల యూనిట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.