యువతకు ఉద్యోగాల బాట చూపించిన నారా లోకేష్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాల బాట చూపించిన నాయకుడిగా మంత్రి నారా లోకేష్ నిలిచారని సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మెగా డీఎస్సీ నిర్వహణ మరియు ఉపాధ్యాయ ఉద్యోగాల భప్తీ దిశగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు నిరుద్యోగుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యువత సంక్షేమం, ఉపాధి కల్పనే ధ్యేయంగా అడుగులు వేస్తోందని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారని శ్రేణులు కొనియాడుతున్నాయి.