అమరావతి అభివృద్ధికి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
రిపోర్టర్: రాము
స్థలం: అమరావతి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. దాదాపు 60కి పైగా ప్రధాన అజెండా అంశాలతో ఈ సమావేశం జరుగుతుండగా పెట్టుబడులను ఆకర్షించడం, రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడంపై విస్తృతంగా చర్చిస్తున్నారు. అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు రూ. 644.98 కోట్లు, శాసనసభ నూతన భవన నిర్మాణ పనుల కోసం రూ. 661 కోట్ల నిధుల వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.